Pages

Tuesday, 30 October 2012

సకల జనుల సమ్మె అడ్వాన్సు వెంటనే మాఫీ చేయాలి: టి బి జి కే ఎస్ 

              జి డి కే  అక్టోబర్ 30: సకల జనుల సమ్మె అడ్వాన్స్ ను వెంటనే మాఫీ చేయాలనీ తెలంగాణా బొగ్గుగని కార్మిక సంఘం ఒక ప్రక్క కోరుతుంటే యాజమాన్యం మాత్రం ఈ నెల వేఅతనం నుండి రికవరీ మొదలు పెట్టాలని సర్క్యులర్ జారి చేయటం విడ్డూరం. ఇంతకు ముందే అనేక సార్లు ఈ విషయమై సింగరేణి చైర్మెన్ ముఖ్యమంత్రి ని కలిసి ఎన్ని సార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదు. సరికదా ఈ సంవత్సరం లాభాల్లో వాటా కోసం పోరాటం లో అన్ని సంఘాలను కలుపుకు పోవాలని అన్ని సంఘాలు విమర్శించాయి. అయినా మేము ఒంటరిగానే పోరాడి 17 % లాభాల్లో వాటా సాధించడం జరిగింది. ఇప్పుడు మా వంతు ప్రయత్నంగా  అన్ని ప్రయత్నాలు చేయడం జరిగింది. కాని కోర్టు ఉత్తర్వుల కారణంగా కంపని రికవరీ మొదలు పెట్టింది. అయినా ఇంతకుముందే  మేము అన్ని ప్రాతినిధ్య సంఘాలను కలుపుకొని పోవడానికి ప్రయత్నించినా కూడా హెచ్.ఎం. ఎస్. మొనహా అన్ని సంఘాలు మొహం చాటేశాయి. మేము ఇప్పటికైనా అన్ని సంఘాలను ఒక్కటే కోరుతున్నాం. మీరందరూ కలిసివచ్చినా రాకపోయినా మా వంతు ప్రయత్నంగా మేము కంపని సి.&ఎం. డి.ని మరియు ముఖ్యమంత్రిని కోరుతాం. కార్మికుల ఎ సమస్యల పైన పోరాడటానికి టి. బి. జి. కే. ఎస్. ముందుంటుంది. 

Sunday, 21 October 2012

టి బి జి కే ఎస్  మీట్ ది  ప్రెస్ విశేషాలు :

 (జిడికే 21.10.2012)
                     సింగరేణి కార్మికులకు 17% లాభాల వాట ఇప్పించడం లో గుర్తింపు సంఘం గా చేయవలిసిన పనులు అన్ని చేసి సర్కారు మేడలు వంచడానికి ఆమరణ నిరాహార దేక్ష కైనా వెనకాడ కుండా అన్ని డివిజన్లలో ఆందోళన కార్యక్రమాలు చేసి 17% వాటా సాధిస్తే కొన్ని సంఘాలు తమపై కావాలని దుష్ప్రచారాలు చేయడం ఎంతవరాకు సమంజసం. వారు గుర్తింపు సంఘంగా ఉన్న  4 సంవత్సరాలలో కేవలం 16% మాత్రమె సాధించడం జరిగింది. దానికి కూడా సమ్మె నోటీసు ఇచ్చారు. వారు గెలిచినప్పుడు కూడా మేము విగ్నపనా పత్రాన్ని ఇవ్వడం జరిగింది . కాని వారు ఈ సంవత్సరం వారు కనీసం విగ్నపనా పత్రాలనైనా ఇవ్వలేదు సరికాదా 17% ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నారు.
అంతే కాకుండా 150 యేండ్ల సింగరేణి చరిత్రలో ఏ గుర్తింపు సంఘం చేయని విధంగా వచ్చే నవంబర్ లో వేలుబడే క్లర్క్ పోస్టేల అంతర్గత భర్తీకి మా యూనియన్ తరపున మేమే నిష్ణాతులైన వారిని నియమింఛి కార్మికులకు ఉచితంగా శిక్షణ అందిస్తాం.
అదే విధంగా సకల జనుల సమ్మె అడ్వాన్స్ రూ.17,500/- మాఫీ కొరకు అన్ని ప్రాతినిధ్య సంఘాలను కలుపుకొని పోవడానికి సిద్ధంగా ఉన్నాము. ఇప్పటికే కొన్ని సంఘాలకు లెటర్లు వ్రాయడం జరిగింది. త్వరలోనే మిగితా సంఘాలకు లెటర్లు వ్రాస్తాము. అన్ని సంఘాలు కలిసి వచ్చి సమ్మె అడ్వాన్స్ మాఫీ కొరకు క్రుశిచేయవలసినదిగా కోరుతున్నాము.
 
                                                                                                                                  ఇట్లు 
                                                                                                                            మీ.... 
                                                                                                                                కెంగర్ల మల్లయ్య 
                                                                                                                              అధ్యక్షులు టి బి జి కే ఎస్

Tuesday, 16 October 2012

టి బి జి కే ఎస్ ఆధ్వర్యం లో గోదావరి  ఖనిలో  భారీగా విజయోత్సవ  ర్యాలి:
        
           టి బి జి కే ఎస్ ఆర్ జి 1 ఏరియా కమిటి ఆధ్వర్యం లో భారి ర్యాలి జరిగింది. ఉదయం జి యం ఆఫీస్ ముందు  రిలే నిరాహార దేక్షలలొ కూర్చున్న వారితో  సాయంత్రం  ర్యాలీగా జి యం ఆఫీస్ నుండి చౌరస్తా లోని ప్రధాన కార్యాలయం వరకు ర్యాలి కొనసాగింది. దీనిలో ఆర్ జి 1 ఉపాధ్యక్షులు శ్రీ గండ్ర దామోదర్ రావు ఆధ్వర్యంలో ఈ ర్యాలి జరిగింది. దీనిలో రామగుండము 1 రీజియన్ లోని అన్ని బావుల పిట్ కార్యదర్శులతో పాటు టి బి జి కే ఎస్ కేంద్ర కమిటి నాయకులతో పాటు డివిజన్ నాయకులు భారి సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. అనంతరం జరిగిన కార్యక్రం లో పలువురు మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాల నుండి 16% మాత్రమె వస్తున్నదని, టి బి జి కే ఎస్ చేసిన కృషి వల్లనే ఈ సంవత్సరం 17% సాధించగలిగామని, తన ప్రాణాలకు సైతం తెగించి ఆమరణ నిరాహార దేక్షకు సైతం కూర్చున్న గౌరవ అధ్యక్షులు  నల్లాల  ఓదెలు కు కృతజ్ఞతలు తెలిపారు.ఇంతవరు ఏ శాసన సభుడు కూడా సింగరేణి కార్మికుల సమస్యలపై ఆమరణ నిరాహార దేక్షకు కూర్చోవడం జరగలేదని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. అదే విధంగా ఈరోజు ఉదయం రిలే నిరాహార దెక్షకు కూర్చున్న వన్ ఇంక్లైన్ కార్మికులకి కృతజ్ఞతలు తెలిపారు. ఈకార్యక్రం లో డివిజన్ డిప్యూటి జనరల్ సెక్రటరీ కే.రాజమౌళి, కేంద్ర కమిటి నాయకులు గద్దె కుమారస్వామి, ఐ సత్యనారాయణ, భాస్కర్ రెడ్డి  కనకం శాంసన్, పిట్ సెక్రెటరిలు దండె రవి, ఈ రామస్వామి, మొగిలి, రమేష్ రెడ్డి, పోషం, అంతయ్య, కనకయ్య, పుర్మ సత్యనారాయణ మరియు ఇతర నాయకులు కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

సింగరేణి ఆర్జించిన లాభాల్లో 17 శాతం వాటా ప్రకటన 

         2011-2012 ఆర్ధిక సంవత్సరం లో సింగరేణి సంస్థ ఆర్జించిన 519 కోట్ల లో కార్మ్కకు లకు 25 శాతం వాటా ఇవ్వాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం మొదటి నుండి కోరుతోంది. ఈవిషయం పై గత రెండు నెలలుగా 5 సార్లు ముఖ్యమంత్రి కి విజ్ఞప్తి చేసినా కూడా ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోలేదు. చివరకు విసుగు చెందినా మా గౌరవ అధ్యక్షులు, చెన్నూరు శాసన సభ్యులు  శ్రీ  నల్లాల ఓదెలు నిన్నటి నుండి మందమర్రి జి యం ఆఫీస్ ముందు ఆమరణ నిరాహార దేక్షకు కూర్చోవడం జరిగింది. ఆయనకు సంఘీభావంగా సింగరేణి వ్యాప్తంగా కార్మికులు ఆందోళనలు కొనసాగించారు. చివరకు ఈ రోజు మధ్యాహ్నం ప్రభుత్వం 17 శాతం వాటాను ప్రకటించింది. ఇది కూడా దసరా పండగకి ముందే అందించాలని సింగరేణి భావిస్తోంది. ఇది సింగరేణి కార్మికుల విజయంగానే టి.బి.జి.కే.ఎస్. ప్రకటించింది. ఇక ముందు కూడా కార్మికుల సమస్యలపై పోరాడేందుకు  టి.బి.జి.కే.ఎస్. ఎల్లప్పుడూ ముందుంటుంది. సింగరేణి కార్మికులకు ఎ విధమైన సమస్య వచ్చినా అక్కడ  టి.బి.జి.కే.ఎస్. కార్యకర్తలు ముందు ఉంటారు. 




మరిన్ని వివరాలకు మా అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి :
 singareni Bonus: victoryof TBGKS


Saturday, 13 October 2012

Representation to CM On 25% on Benifitt

Our Union (TBGKS) President Sri Kengarla Mallaiah, has given a representation on 25% of the company's Benifits to be given to the Employees, with  Honorable president Sri Nallala Odelu and TRS L P Leader Sri Eetela Rajender, Godavarikhani MLA sri Somarapu satyanarayana,  Vemulawada MLA chennamaneni Ramesh MLC Naradasu laxman Rao, and  Central Committee leader Noone Komuraiah and others. The Chief Minister given the same answer last three times "I will see the matte in 2 days". then our Honorable President Sri Nalla Odelu Has replied " If the Problem is not settled before Monday I will start the Non Breakable Hunger Strike at Mandamarri Area GM office. TBGKS requesting the followers to all division members to Start Relay  Hunger Strike at all Areas GM offices from Tuesday onwords

Tuesday, 2 October 2012

మహాత్మ  గాంధి ఆలోచనలు నేటికీ ఆచరణీయం : కెంగర్ల మల్లయ్య 

భారత స్వతంత్ర ఉద్యమం ను  శాంతి ,త్యాగం  సామరస్యం ల తో గాంధీజీ సాగించి విజయం సధించా ర ని  ఈనాటికీ శాంతి ద్వారానే  ఏ దైన  సాధించవచ్చని  టి .బి. జి. కే. ఎస్. అధ్యక్షులు కెంగర్ల మల్లయ్య అన్నారు. గాంధి జయంతి సందర్భంగా గోదావరిఖని  చౌరస్తా లోని  గాంధి విగ్రహానికి అయన పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గాంధిజీ విలువలతో కూడిన జీవితాన్ని గడిపారని అందుకే  ఆయన  జీవితం నేటికి ఆదర్శ ప్రాయమని, కొనియాడారు  అని నేటి యువత ఆయనను ఆదర్శం గా తీసుకోని అభివృద్దిలోకి రావాలని అయన పిలుపునిచ్చారు . తెలంగాణ ఉద్యమంలో కూడా ఇప్పటి   వరకు శాంతి మార్గం లో పయనిచిందని , రాబోయే కాలంలో కూడా శాంతి  మార్గం లోనే  పయనించి, తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రం లో టి బి జి కే ఎస్ నాయకులు  నూనె కొమురయ్య ,గద్ద కుమార స్వామి. భాస్కర్ రెడ్డి, మజిక్ హరి, దండె రవి,  కుంట కొమురయ్య, అంతయ్య ,దాసరి మొగిలి, పూర్మ సత్యనారాయణ , దామ నరసయ్య ,దాసి ఎల్లయ్య ,జాబు పోషం, పూర్ణచ్గందర్ ,రాజ శంకర్ తదితరులు పాల్గొన్నారు.   

Monday, 1 October 2012

telangana march

తెలంగాణా మార్చ్ విజయవంతం చేసిన కార్మికులు 

హైదరాబాద్ లో నిన్న జరిగిన తెలంగాణా మార్చ్ లో పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొని మార్చ్ విజయవంతం చేశారు. నెత్తిన టోపీ , చేతిలో చెమ్మచ్  మరో చేతిలో బుట్టల తో కార్మికులు పోలిసుల నిర్భందాన్ని సైతం లెక్క చేయకుండా వచ్చి తెలంగాణ రాష్ట్ర  ఆకాంక్ష ను మరోసారి చాటిచెప్పారు .