టి బి జి కే ఎస్ మీట్ ది ప్రెస్ విశేషాలు :
(జిడికే 21.10.2012)
సింగరేణి కార్మికులకు 17% లాభాల వాట ఇప్పించడం లో గుర్తింపు సంఘం గా చేయవలిసిన పనులు అన్ని చేసి సర్కారు మేడలు వంచడానికి ఆమరణ నిరాహార దేక్ష కైనా వెనకాడ కుండా అన్ని డివిజన్లలో ఆందోళన కార్యక్రమాలు చేసి 17% వాటా సాధిస్తే కొన్ని సంఘాలు తమపై కావాలని దుష్ప్రచారాలు చేయడం ఎంతవరాకు సమంజసం. వారు గుర్తింపు సంఘంగా ఉన్న 4 సంవత్సరాలలో కేవలం 16% మాత్రమె సాధించడం జరిగింది. దానికి కూడా సమ్మె నోటీసు ఇచ్చారు. వారు గెలిచినప్పుడు కూడా మేము విగ్నపనా పత్రాన్ని ఇవ్వడం జరిగింది . కాని వారు ఈ సంవత్సరం వారు కనీసం విగ్నపనా పత్రాలనైనా ఇవ్వలేదు సరికాదా 17% ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నారు.
అంతే కాకుండా 150 యేండ్ల సింగరేణి చరిత్రలో ఏ గుర్తింపు సంఘం చేయని విధంగా వచ్చే నవంబర్ లో వేలుబడే క్లర్క్ పోస్టేల అంతర్గత భర్తీకి మా యూనియన్ తరపున మేమే నిష్ణాతులైన వారిని నియమింఛి కార్మికులకు ఉచితంగా శిక్షణ అందిస్తాం.
అదే విధంగా సకల జనుల సమ్మె అడ్వాన్స్ రూ.17,500/- మాఫీ కొరకు అన్ని ప్రాతినిధ్య సంఘాలను కలుపుకొని పోవడానికి సిద్ధంగా ఉన్నాము. ఇప్పటికే కొన్ని సంఘాలకు లెటర్లు వ్రాయడం జరిగింది. త్వరలోనే మిగితా సంఘాలకు లెటర్లు వ్రాస్తాము. అన్ని సంఘాలు కలిసి వచ్చి సమ్మె అడ్వాన్స్ మాఫీ కొరకు క్రుశిచేయవలసినదిగా కోరుతున్నాము.
ఇట్లు
మీ....
కెంగర్ల మల్లయ్య
అధ్యక్షులు టి బి జి కే ఎస్
No comments:
Post a Comment