సకల జనుల సమ్మె అడ్వాన్సు వెంటనే మాఫీ చేయాలి: టి బి జి కే ఎస్
జి డి కే అక్టోబర్ 30: సకల జనుల సమ్మె అడ్వాన్స్ ను వెంటనే మాఫీ చేయాలనీ తెలంగాణా బొగ్గుగని కార్మిక సంఘం ఒక ప్రక్క కోరుతుంటే యాజమాన్యం మాత్రం ఈ నెల వేఅతనం నుండి రికవరీ మొదలు పెట్టాలని సర్క్యులర్ జారి చేయటం విడ్డూరం. ఇంతకు ముందే అనేక సార్లు ఈ విషయమై సింగరేణి చైర్మెన్ ముఖ్యమంత్రి ని కలిసి ఎన్ని సార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదు. సరికదా ఈ సంవత్సరం లాభాల్లో వాటా కోసం పోరాటం లో అన్ని సంఘాలను కలుపుకు పోవాలని అన్ని సంఘాలు విమర్శించాయి. అయినా మేము ఒంటరిగానే పోరాడి 17 % లాభాల్లో వాటా సాధించడం జరిగింది. ఇప్పుడు మా వంతు ప్రయత్నంగా అన్ని ప్రయత్నాలు చేయడం జరిగింది. కాని కోర్టు ఉత్తర్వుల కారణంగా కంపని రికవరీ మొదలు పెట్టింది. అయినా ఇంతకుముందే మేము అన్ని ప్రాతినిధ్య సంఘాలను కలుపుకొని పోవడానికి ప్రయత్నించినా కూడా హెచ్.ఎం. ఎస్. మొనహా అన్ని సంఘాలు మొహం చాటేశాయి. మేము ఇప్పటికైనా అన్ని సంఘాలను ఒక్కటే కోరుతున్నాం. మీరందరూ కలిసివచ్చినా రాకపోయినా మా వంతు ప్రయత్నంగా మేము కంపని సి.&ఎం. డి.ని మరియు ముఖ్యమంత్రిని కోరుతాం. కార్మికుల ఎ సమస్యల పైన పోరాడటానికి టి. బి. జి. కే. ఎస్. ముందుంటుంది.
No comments:
Post a Comment