టి బి జి కే ఎస్ ఆధ్వర్యం లో గోదావరి ఖనిలో భారీగా విజయోత్సవ ర్యాలి:
టి బి జి కే ఎస్ ఆర్ జి 1 ఏరియా కమిటి ఆధ్వర్యం లో భారి ర్యాలి జరిగింది. ఉదయం జి యం ఆఫీస్ ముందు రిలే నిరాహార దేక్షలలొ కూర్చున్న వారితో సాయంత్రం ర్యాలీగా జి యం ఆఫీస్ నుండి చౌరస్తా లోని ప్రధాన కార్యాలయం వరకు ర్యాలి కొనసాగింది. దీనిలో ఆర్ జి 1 ఉపాధ్యక్షులు శ్రీ గండ్ర దామోదర్ రావు ఆధ్వర్యంలో ఈ ర్యాలి జరిగింది. దీనిలో రామగుండము 1 రీజియన్ లోని అన్ని బావుల పిట్ కార్యదర్శులతో పాటు టి బి జి కే ఎస్ కేంద్ర కమిటి నాయకులతో పాటు డివిజన్ నాయకులు భారి సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. అనంతరం జరిగిన కార్యక్రం లో పలువురు మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాల నుండి 16% మాత్రమె వస్తున్నదని, టి బి జి కే ఎస్ చేసిన కృషి వల్లనే ఈ సంవత్సరం 17% సాధించగలిగామని, తన ప్రాణాలకు సైతం తెగించి ఆమరణ నిరాహార దేక్షకు సైతం కూర్చున్న గౌరవ అధ్యక్షులు నల్లాల ఓదెలు కు కృతజ్ఞతలు తెలిపారు.ఇంతవరు ఏ శాసన సభుడు కూడా సింగరేణి కార్మికుల సమస్యలపై ఆమరణ నిరాహార దేక్షకు కూర్చోవడం జరగలేదని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. అదే విధంగా ఈరోజు ఉదయం రిలే నిరాహార దెక్షకు కూర్చున్న వన్ ఇంక్లైన్ కార్మికులకి కృతజ్ఞతలు తెలిపారు. ఈకార్యక్రం లో డివిజన్ డిప్యూటి జనరల్ సెక్రటరీ కే.రాజమౌళి, కేంద్ర కమిటి నాయకులు గద్దె కుమారస్వామి, ఐ సత్యనారాయణ, భాస్కర్ రెడ్డి కనకం శాంసన్, పిట్ సెక్రెటరిలు దండె రవి, ఈ రామస్వామి, మొగిలి, రమేష్ రెడ్డి, పోషం, అంతయ్య, కనకయ్య, పుర్మ సత్యనారాయణ మరియు ఇతర నాయకులు కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment